TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీట్ రద్దుపై సీఎం రేవంత్ ఫైర్.. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన

Published on: Thu May 14, 2026 6:32PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్.. పర్యవశానంగా నీట్ రద్దు పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన వల్ల లక్షలాది మంది విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని   ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన పరీక్షల్లో ఇటువంటి అవకతవకలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. 

సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల శ్రమతో కూడిన ఈ పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (  పారదర్శక  విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కావడమనేది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ఇది యువత భవిష్యత్తును నీరుగార్చడమేనని విమర్శించారు 

 పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీల వంటి అంశాల్లో గత ప్రభుత్వాల తీరుకు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరికి పెద్దగా తేడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షల విశ్వసనీయత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, అక్రమాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన సూచించారు.

పోటీ పరీక్షలు అనేవి విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా ఉండాలి తప్ప..  వారి జీవితాలను గందరగోళంలోకి నెట్టే సాధనాలుగా మారకూడదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.