ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం కిరణ్

posted on: May 22, 2012 5:03PM

మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి మునియప్ప సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి సహాయాన్ని అందించడానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మునియప్ప మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాల్లోని ఒకరికి రైల్వే ఉద్యోగం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని ముకుల్ రాయ్ హామీ ఇచ్చారు. రైలు ప్రమాద ఘటనపై సమగ్రంగా విచారణ జరిపిస్తామన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...