తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ

posted on: Mar 22, 2021 12:45PM

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 30 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి చెప్పారు. పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. రిటైర్మెంట్ వయసును ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.  అంతర్ జిల్లాల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్.. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపార

ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా ఆలస్యం అయ్యిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని తెలిపారు కేసీఆర్. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...