నేతలు వైకాపాకు దూరం అవ్వటానికి కారణం అదే..

posted on: Jan 25, 2019 10:19AM

 

తెదేపా నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం ఇంకా రూ.1.16 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉందని, దానిపైనే ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. జయప్రకాశ్ నారాయణ కమిటీ కూడా కేంద్రం రాష్ట్రానికి రూ.85వేల కోట్లు ఇవ్వాలని సూచించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జేఎఫ్‌సీ రూ. 75 వేల కోట్లు ఇవ్వాలని పేర్కొందని అన్నారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని, పార్లమెంటులో 15 పార్టీలు కేంద్రాన్ని నిలదీశాయన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీని జగన్‌ ఎందుకు ప్రశ్నించరని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, దాని కీలుబొమ్మ పార్టీలకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఇంటికి పోయే టైమ్ వచ్చిందని చంద్రబాబు అన్నారు.

సానుకూల నాయకత్వానికి తెదేపా.. ప్రతికూల నాయకత్వానికి జగన్ ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెడు జరగాలి, అభివృద్ది ఆగిపోవాలి అనేదే వైకాపా పెడధోరణి అని.. దుష్ప్రచారంలో జగన్ ఘనాపాఠి అన్నారు. డబ్బుతో దేనినైనా కొంటాననేది జగన్ అహంభావమని సీఎం ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటేనని.. ఆ సర్వేలతో  ప్రజాదరణను తారుమారు చేయలేరన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ఇదేవిధంగా తప్పుడు సర్వేలు చేశారని, ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించిన విషయం గుర్తుచేశారు. ప్రజాభిమానాన్ని తెదేపాకి దూరం చేయడం అసాధ్యమన్నారు. జగన్ అహంభావం భరించలేకే అనేక మంది వైకాపాకు దూరమవుతున్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...