అది చంద్రబాబుకు మంచి వార్తనే


 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో రాష్ట్ర నూతన పర్యాటక విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని.. దీనికి సంబంధించి వివిధ ప్యాకేజీలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా దీనిని రూపొందించామని తెలిపారు. ఈ నూతన పర్యాటక విధానం ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. అంతేకాదు పంచంలోనే అత్యంత ధనవంతమైన, పవర్ ఫుల్ గాడ్ శ్రీవారు అని.. వెంకటేశ్వర స్వామి బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని.. ఆయనకు రూ.10,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆక్కడ ఉన్నవారిని నవ్వించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ కు అరుదైన ఘనత లభించింది. ఏంటంటే ప్రపంచ బ్యాంకు తాజాగా ఒక ప్రకటన చేసింది. వ్యాపార అనుకూల వాతావరణ రాష్ట్రాలను జాబితాలో గుజరాత్‌కు తొలి స్థానం లభించగా ఏపీకి రెండో స్థానం దక్కింది. మొత్తానికి ఇది చంద్రబాబుకు తీపి కబురు లాంటిదే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu