ఏడు రహదారులకు శంకుస్థాపన.. 9 నగరాలు ఉంటాయి...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో సుమారు రూ.915కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ రోడ్ల నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. ఏడు ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తూర్పు-పశ్చిమ దిశల్లో మూడు, ఉత్తర-దక్షిణ దిశల్లో నాలుగు రహదారులను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.  ‘ ఆంధ్రులకు అపార జ్ఞానం ఉంది. ఏపీకి చెందిన వారు అనేక దేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అమరావతిని నాలెడ్జ్‌ సిటీగా తీర్చిదిద్దుతాం. రాజధానిలో 9 నగరాలు ఉంటాయి. ప్రపంచంలోనే మేటైన నగరంలో అమరావతి నిలుస్తుంది. చారిత్రక వారసత్వం ఉన్న అమరావతిని మళ్లీ రాజధానిగా ప్రకటించి కొత్త చరిత్ర నాంది పలికాం. మూడేళ్లకు ముందు ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఇక్కడే రాజధాని నిర్మించాలని వీరోచిత నిర్ణయం తీసుకున్నాం. రాజధానిని హరిత, నీలి నగరంగా తీర్చిదిద్దుతాం’ అని చంద్రబాబు అన్నారు.