చంద్రబాబు మీటింగ్ లో మందుబాబు హడావుడి...

 

విజయవాడలో రెండు రోజుల నుండి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో ఓ మందుబాబు హల్ చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. భారీ బందోబస్తు మధ్య నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సదరు మందుబాబు ఫూటుగా మద్యం సేవించి దర్జాగా సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతను అంత దర్జాగా లోపలికి వెళ్లినా కూడా భద్రతా సిబ్బంది ఎవరూ అతనిని గుర్తించలేకపోయారు. దాదాపు అరగంటకు పైగా అతను అక్కడ కూర్చున్నాడు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లంచ్ చేయడానికి వెళ్లారు. అనంతరం తిరిగి వచ్చే సరికి కూడా అతను అక్కడే కూర్చుని ఉండటంతో.. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ లు అతనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇక ఆ తరువాత పోలీసులు హడావుడి చేసి అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన అతను తాను టీడీపీ నేతను అని చెప్పగానే వదిలిపెట్టారు. మరోవైపు ఇంత నిర్లక్ష్యంగా ఉన్న భద్రతా సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

విజయవాడలో రెండు రోజుల నుండి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో ఓ మందుబాబు హల్ చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. భారీ బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ సదస్సులో సదరు మందుబాబు ఫూటుగా మద్యం సేవించి దర్జాగా సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతను అంత దర్జాగా లోపలికి వెళ్లినా కూడా భద్రతా సిబ్బంది ఎవరూ అతనిని గుర్తించలేకపోయారు. దాదాపు అరగంటకు పైగా అతను అక్కడ కూర్చున్నాడు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లంచ్ చేయడానికి వెళ్లారు. అనంతరం తిరిగి వచ్చే సరికి కూడా అతను అక్కడే కూర్చుని ఉండటంతో.. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ లు అతనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇక ఆ తరువాత పోలీసులు హడావుడి చేసి అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన అతను తాను టీడీపీ నేతను అని చెప్పగానే వదిలిపెట్టారు. మరోవైపు ఇంత నిర్లక్ష్యంగా ఉన్న భద్రతా సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu