TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాకు అంత అవసరం లేదు.. చంద్రబాబు

Published on: Thu Apr 28, 2016 12:31PM

 

ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీ లోకి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు జంప్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 15 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకోగా.. ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.  దీంతో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తమ పార్టీలోని ఎమ్మెల్యేలను డబ్బులకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తనకు లేదని, అయినా తనకు ఏ బలహీనతలు లేవని కూడా చంద్రబాబు తేల్చిచెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు అని చంద్రబాబు అన్నారు.

 

ఇదిలా ఉండగా నిన్ననే వైసీపీ నుంది అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి చేరగా.. ఈరోజు బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.