Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు ఇవే..
posted on: Apr 27, 2016 3:31PM
.jpg)
మెున్నటి వరకూ చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన దానిపై రగడ జరిగింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్ ల పనితీరుపై సర్వేచేసి ర్యాంకులు ప్రకటించారు. అయితే ఆశ్చర్యమేంటంటే.. ఈ సర్వేలే చంద్రబాబుకు వచ్చిన ఐదవ స్థానంలో నిలిచారు. మరి ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు ఏంటో ఓ లుక్కేద్దాం..
* తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్.. మొదటి స్థానం.. రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్
* ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణ, పలమనేరు ఇన్‌చార్జి సుభా్‌షచంద్రబోస్.. 2వ స్థానం.. రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంక్.
* మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.. 3వ స్థానం.. రాష్ట్రంలో 35వ ర్యాంక్
* పుంగనూరు ఇనఛార్జి వెంకట్రమణరాజు..4వ స్థానం.. రాష్ట్రస్థాయిలో 53వర్యాంకు
* చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీమంత్రి గల్లా అరుణకుమారికి, పీలేరు ఇన్‌చార్జి ఇక్బాల్ అహ్మద్.. 5వ స్థానం.. రాష్ట్రస్థాయిలో 73వర్యాంకు
* సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య.. 6 వ స్థానం.. రాష్ట్రస్థాయిలో 116వ ర్యాంకు.
* చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ.. 7వ స్థానం.. రాష్ట్రంలో 121వ ర్యాంకు
* పూతలపట్టు ఇన్‌చార్జి లలితకుమారి.. 8వ స్థానం.. రాష్ట్రంలో 126వ ర్యాంకు
* జీడీనెల్లూరు ఇన్‌చార్జి కుతూహలమ్మ.. 9వస్థానం.. రాష్ట్రస్థాయిలో 138 వ ర్యాంకు
ఇక మదనపల్లి నియోజక వర్గానికి ఇంఛార్జ్ లేకపోవడంతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో 159వ ర్యాంకు వచ్చింది.






