చంద్రబాబు నా సోదురుడు... ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నా.. ఉమాభారతి
Published on: Mon Apr 25, 2016 4:09PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు నీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఉమా భారతి మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నా సోదురుడు లాంటివాడని ఆమె అన్నారు. అంతేకాదు చంద్రబాబు ఫాస్ట్ ట్రాక్ సీఎం.. ఆయన పని చేసే విధానం తనకెంతో ఇష్టమని.. తాను అనుకున్నది సాధిస్తారని.. తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా లేరని, కానీ తాను ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నానని ఉమాభారతి తెలిపారు. 2018లోగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.


