చంద్రబాబు బాగా ఆలోచించి ఇచ్చినట్టున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి నేతలకు పదవులు కట్టిపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం చంద్రబాబు రాష్ట్ర, జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులను ప్రకటించిన నేపథ్యంలో పలువురుకి పదవులు ఇవ్వడంపై చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే నారా లోకేశ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యలు ఇచ్చారు. ఇక తెలంగాణ సంగతికి వచ్చేసరికి ఎన్నో అనుమానాలు.. ఎన్నో ట్విస్ట్ ల నేపథ్యంలోఈసారి కూడా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఎల్. రమణకే అప్పగించారు. దీని వెనుక కారణం లేకపోలేదు. ఎల్ రమణ బిసి వర్గానికి చెందిన నేత.. టీడీపీకి బిసిలలో మంచి పట్టు ఉంది.. కనుక ఈ వర్గాన్ని దూరం చేసుకోవద్దనే కారణంతో మళ్లీ పార్టీ పగ్గాలు ఎల్. రమణకే చెందాయి. మరోవైపు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిండెంట్ ఇవ్వడంపై కూడా  పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ ను ఎదుర్కోవడం మొదటిది. దీనివల్ల అతి తక్కువ కాలంలోనే రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది. ఇంకా ఎర్రబెల్లి.. ముందు అధ్యక్ష పదవి కోసం చూసినా అది మాత్రం రాలేదు.. ఎప్పిటిలాగే పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. బిసి నేత దేవేందర్ గౌడ్‌ను కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారుయ.

అంతేకాదు గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు మంచి పోటీ ఇచ్చిన ఒంటేరు రైతు విభాగం అధ్యక్షునిగా.. శోభారాణిని తెలుగు మహిళా అధ్యక్షురాలిగా తీసుకున్నారు. మొత్తానికి చంద్రబాబు సభ్యల ఎన్నికల విషయంలో చాలా లోటుపాట్లు ఆలోచించి పదవులు కట్టబెట్టినట్టే కనిపిస్తుంది.