లోకేశ్, రేవంత్ కు కీలక పదవులు

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జాతీయ, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల కమిటీలను ప్రకటించారు. ఈసందర్భంగా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కు.. తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి...

* కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్‌లు ఉండనున్నారని తెలుస్తోంది.

* ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది.

* అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం.

* తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకముందు కొనసాగిన ఎల్ రమణనే కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు.

* ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu