రెండు కాపురాలు చేస్తున్నట్టుంది.. చంద్రబాబు



ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తనతో పాటు దాదాపు వెయ్యిమంది అనుచరులు టీడీపీలోకి చేరారు. స్వయంగా చంద్రబాబే కండువా కప్పి ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో రాజకీయం గురించి కాదు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని.. రాష్ట్ర అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నాం దానికి మీఅందరి సహకారం కూడా కావాలని పార్టీలో చేరిన నేతలకు సూచించారు.

 

ఇంకా రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అతి దారుణంగా విభజించిందని.. రాష్ట్ర విభజన చూస్తుంటే బాధ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేదు.. ఇలాంటి పరిస్థితిలో మనం రాజధాని అయిన అమరావతిని ఎంత త్వరగా నిర్మించుకుంటే అంత మంచిదని సూచించారు. రాజధాని లేకపోవడం వల్ల ఇక్కడ మూడు రోజులు ఉంటే.. హైదరాబాద్ లో మూడు రోజులు ఉండాల్సి వస్తుందని.. మనది రెండు కాపురాల అవస్థలా ఉందని అన్నారు. హైదరాబాద్ లో ఒక కాపురం.. విజయవాడలో ఒక కాపురం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న కొంత మంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు.. ఇంకా రావాల్సి ఉంది.. ఉద్యోగుల తరలింపులో కొన్ని ఇబ్బందులు ఉన్నా తప్పనిసరిగా రావాలి.. లేకపోతే ప్రజల్లో విశ్వాసం పోతుందని.. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.