జగన్ కు చంద్రబాబు సూటిప్రశ్న..



ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా అధికారపార్టీకి.. ప్రతిపక్ష పార్టీకి మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. పట్టిసీమ ప్రాజెక్టు పైన ఇరు పార్టీలు వాదోపవాదాలు చేసుకున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు జగన్ ను ఇరుకునపెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకమా? లేదా అనుకూలమా అని నేరుగా సవాల్ విసిరారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి వాసులకు నీటిని అందించవచ్చని.. గోదావరి జిల్లాల్లో రెండో పంటకు కూడా నీరివ్వచ్చని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో రెండో పంట బాధ్యత తమదే అన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తయితే మూడో పంటకు కూడా నీరిస్తామని అన్నారు. గోదావరికి మొదటి ప్రాధాన్యం ఇస్తానన్నారు..అసలు మీరు పట్టిసీమకు వ్యతిరేకమా? అనుకూలమా?, పట్టిసీమపై మీ స్టాండ్ ఏమిటో చెప్పాలని జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. ఒకవేళ ఈ రోజు చెప్పలేకపోతే ఈరోజు రాత్రి ఆలోచించి రేపు చెప్పండని.. ఏదో ఒక స్టాండ్ చెప్పే వరకూ మీకు మాట్లాడే అర్హత  లేదని మండిపడ్డారు.