TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేదల కోసం ఎనలేని కృషి చేశారు.. చంద్రబాబు

Published on: Sat Jul 4, 2015 2:43PM

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు 118 వ జయంతి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కీర్తి తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందని అన్నారు. పేదల కోసం ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. అంతేకాదు త్వరలోనే అల్లూరి సీతారామరాజు విగ్రహం ఒకటి అసెంబ్లీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గిరిజనాభివృద్ధికి అల్లూరి సీతారామరాజు విశేష కృషి చేశారని.. అదే స్ఫూర్తితో మేము కూడా గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు.