Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుపై కేసు అంత ఈజీ కాదు..
posted on: Jun 12, 2015 6:22PM

రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి అటు తెలంగాణకు కాని ఇటు ఆంధ్రాకు కాని ఎదో విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎన్ని గొడవలు, వివాదాలు జరిగినా అవన్నీ ఇప్పుడు తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు వివాదం కింద దిగదుడుపే. రేవంత్ రెడ్డి అరెస్ట్ వల్ల ఒక్కసారిగా ఇరు రాష్ట్రాలలోని రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబును ఈ కేసులో ఇరికించాలని విశ్వ ప్రయత్నమే చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి అనే చిన్న పిచ్చుక ద్వారా చంద్రబాబు పై బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబు పై ఒక్కో బ్రహ్మస్త్రాన్ని వదులుతుంది.
మొదటి బ్రహ్మస్త్రంగా.. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన సంభాషణలు అంటూ ఓ న్యూస్ ఛానల్ లో కూడా విడుదల చేసింది. కానీ అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కలిసిరాలేదు. ఎందుకంటే బయటకు వచ్చిన ఆ సంభాషణల వీడియోలో చంద్రబాబు ఎక్కడా డబ్బు గురించి కానీ ఓటు గురించి కానీ ప్రస్తావించింది లేదు. అసలు చంద్రబాబు స్టీఫెన్ సన్ తో సంభాషించలేదని.. ఎక్కడెక్కడో చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ తీసుకొచ్చి గుదిగుచ్చి వీడియో చేసి తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని టీడీపీ నేతలు మొత్తుకుంటున్నారు. రెండోదిగా రేవంత్ రెడ్డి బాస్ ఉచ్చారణ... ఏసీబీ అధికారులు ఈ కోణంలో కూడా గట్టి ప్రయత్నమే చేశారు.. రేవంత్ రెడ్డి స్టీఫేన్ సన్ తో మాట్లాడినప్పుడు 'బాస్' అని ఉచ్ఛరించగా ఆ 'బాస్' ఎవరూ అనే తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి బాస్ అని మాత్రమే చెప్పాడు కాబట్టి ఆ బాస్ చంద్రబాబే అని గ్యారెంటీ లేదు.. సో ఈ రకంగా కూడా చంద్రబాబు పై కేసు పెట్టడం అంత ఈజీ కాదు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబుకు పూర్తి మద్ధతు ఇవ్వడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంది. కేసీఆర్ ఏమన్నా నీతిపరుడా. ఆయన చేసిన భాగోతం మాకు తెలుసు అని కేంద్రమంత్రులు మండిపడుతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం.. అంతేకాక స్టింగ్ ఆపరేషన్ చేసేముందు ఎన్నికల కమిషన్ కు ముందుగానే చెప్పి చేయాలి. కానీ అలాకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి నిబంధనలేమి పాటించకుండా కేవలం టీడీపీ మీద అక్కసుతో తామే ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పరిస్థితికి తెచ్చుకుంది. దీంతో ఎటు చూసినా ఈ కేసు ద్వారా చంద్రబాబును ఇరికించాలని చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురు కావడం ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబును కేసులో ఇరికించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.






