TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుప్పం బాధితురాలికి చంద్రబాబు పరామర్శ..రూ.5 లక్షల సాయం

Published on: Tue Jun 17, 2025 10:25PM

 

చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు. ఇలాంటి ఘటనలను సహించబోమని ఆమెతో ముఖ్యమంత్రి తెలిపారు.గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.ఈ సందర్భంగా బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు.చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో శిరీషా అనే మహిళను చెట్టుకు కట్టేసి సంగతి తెలిసిందే