TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు.. సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పణ

Published on: Tue May 20, 2025 6:33PM

 

ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.  అనంతరం సాయంత్రం అమరావతి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ ఏర్పాట్లను  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ లైనింగ్‌లో భాగంగా గుడుపల్లె మండల పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. 

ఇక్కడ భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అనంతరం కుప్పం పట్టణంలోని గంగమాంబ ఆలయంవద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి.. సిబ్బందికి సూచనలిచ్చారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్‌ హెలిప్యాడ్‌లో బ్యారికేడ్లు, శానిటేషన్‌ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం అమరావతి నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 2.30 గంటలకు అమరావతికి తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు.