TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Published on: Mon Oct 6, 2025 6:21PM

 

 

ఏపీలో విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధుల  కోసం సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

 విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి పరిమితులు లేకుండా, ఎంతమంది విద్యార్ధులకైనా చదువుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. అటు బీసీ విద్యార్ధులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు.