TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపు హస్తినకు సీఎం చంద్రబాబు

Published on: Mon Sep 29, 2025 3:43PM

 

ఏపీ సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఆయన విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మధ్యహ్నం 12.30 గం.లకు బయలుదేరి 1.30 గం.లకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు.

ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తిరిగి సాయంత్రం 5 గం.లకు సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని బడా పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడుపై ప్రసంగించనున్నారు. కాగా నేడు ముఖ్యమంత్రి విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకోని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.