Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్య తేవాలని వైసీపీ చూస్తోంది : సీఎం చంద్రబాబు
posted on: Feb 2, 2026 2:59PM
.webp)
ఏపీలో లా& ఆర్డర్ సమస్య తేవాలని వైసీపీ చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజా ఘటనలపై టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావుతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో దొరకిపోయిన వైసీపీ.. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోందని.. అందుకే ఆ పార్టీ నేతలు బూతు పురాణం ఎంచుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. టీడీపీని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దని సీఎం సూచించారు.
అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని కూటమి ప్రభుత్వం 20 నెలలుగా పాలనలో అభివృద్ధి జరుగుతోందని.. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రులతో చంద్రబాబు అన్నారు . రెండు రోజులుగా జరిగిన సంఘటనపై అప్రమత్తంగా ఉండాలని. వైసీపీ ఇలా చేయడం వల్లే 2024లో ప్రజలు వారికి అధికారం లేకుండా చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నేతలు చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు


.webp)



