Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కూటమి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా..చంద్రబాబుకు మంత్రులు అభినందనలు
posted on: Jun 4, 2025 7:51PM
.webp)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది.ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియా సమావేశంలో సమావేశంలో వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్టీఆర్ సుజల కింద నీటి శుద్ది చేసే ప్లాంట్‌లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంకు రూ. 8.22 కోట్లు కేటాయించనున్నారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్‌మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది .2025, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావ జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది.
సత్ప్రవర్తన కల్గినందున 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకుంది.ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయించింది.వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించింది.ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలు చేసింది. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఒవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వాటర్‌లో 144 గంటలు ఒవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం చంద్రబాబ కు మంత్రులు అభినందలు తెలిపారు.
కూటమిలోని పక్షాల మధ్య సమన్వయం బాగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పీ4కు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారని .. ఇప్పుడు నేరస్థుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ అధినేత‘జగన్ తప్పు చేశాడు కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించగా.. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ ముఖ్యమంత్రి సూచించారు.






