Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల కొట్లాట.. కేసు నమోదు
posted on: Jul 9, 2019 4:47PM

గుంటూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుల మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి తన ఫోటో పెద్దదిగా వేయించుకుని ఎంపీ నందిగం సురేష్ చిన్నగా వేయించారు. దీంతో ఎంపీ ఫోటో చిన్నగా వేయిస్తారా అంటూ ఆయన అనుచరులు ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అనంతరం ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు పోలీసులను ఆశ్రయించారు. ఎంపీ నందిగం సురేష్ అనుచరులపై ఫిర్యాదు చేశారు. వైసీపీలో గొడవలు కేసులు దాకా పోవడంతో జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.



.jpg)


