సివిల్స్ లో సత్తా చాటిన తెలుగోళ్లు..

posted on: May 11, 2016 4:36PM

 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 48 మంది తమ సత్తా చాటుకున్నారు. మొత్తం 1078 మంది సివిల్స్ లో చోటు సంపాదించుకోగా.. అందులో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ నుండి 48 మంది ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ 48 మందిలో నలుగురు అభ్యర్ధులు 100 లోపు ర్యాంకులు దక్కించుకోగా.. 100 నుండి 500 లోపు 23 మంది మంది.. 500 పైన 21 మంది ర్యాంకులు సంపాదించుకున్నారు.

 

ఇక ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ కి చెందిన టీనా దాబి మొదటి ర్యాంక్ సాధించగా.. కాశ్మీర్ కు చెందిన అతార్ అమీర్ ఉల్ షపీ ఖాన్ రెండో ర్యాంక్ సాధించారు. ఇంకా విశాఖపట్నంకు చెందిన కీర్తి జాతీయ స్థాయిలో 14 వ ర్యాంకు సాధించగా.. చిట్లూరి రామకృష్ణ జాతీయ స్థాయిలో 84వ ర్యాంకు.. స్నేహజ కూడా 103వ ర్యాంకుతో సత్తా చాటింది. శ్రీకాకుళం కు చెందిన భుజంగరావు అనే ఆటో డ్రైవర్ కుమారుడు ఇజ్జాడ మధుసూదనరావు 658వ ర్యాంకుతో సత్తా చాటాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...