కృష్ణాన‌గ‌రే మామా!..సినిమా కష్టాల వెత!

తెలుగు సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాతలు!

సినీ కార్మికులు వ‌ర్సెస్ నిర్మాత‌లు అస‌లు గొడ‌వేంటి? పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ  నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ వీరిక‌స‌లు టాలెంటే లేదు. ఐనా ఐటీ ఎంప్లాయిస్కి ఇచ్చే దానిక‌న్నా భారీ వేత‌నాల‌ను ఇస్తున్నామ‌ని అంటున్నారు. మ‌రో ప‌క్క చూస్తే మూడేళ్లు అయ్యింది.  మా వేత‌నాలు పెంచి..  30 శాతం పెంచ‌ండని డిమాండ్ చేస్తున్నారు తెలుగు సినీ కార్మికులు. అయితే యూనియ‌న్ల అక్ర‌మాలు, అవినీతి కార‌ణంగా సినిమా ఫీల్డ్ లోకి నైపుణ్యం గ‌ల వారు రావ‌డం లేదంటూ,  అందుకు ఉదాహ‌ర‌ణగా  డ్యాన్స‌ర్ల వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తెచ్చారు నిర్మాత విశ్వప్రసాద్.

యూనియ‌న్లు ఒక్కో కార్డు కోసం ల‌క్ష‌లాది రూపాయ‌ల మేర డ‌బ్బు వ‌సూలు చేస్తున్నార‌నీ.. మాలాంటి వారు సిఫార్సు చేసినా కార్డు ఇవ్వ‌డం లేద‌నీ.. దీంతో వారికి తెలిసిన వారినే వెంట తెస్తూ.. ఆపై నైపుణ్యం లేని వారిని సినిమా ఫీల్డ్ లోకి తెస్తున్నార‌ని ఆరోపించారాయ‌న‌. దీంతో తాము   డాన్స‌ర్ల‌ను తేవ‌ల్సి వ‌స్తోంద‌నీ, దీంతో  ఖ‌ర్చు త‌డిసి మోపెడౌతోందపీ అంటున్నారు  నిర్మాత విశ్వ ప్ర‌సాద్. ఆ మాట‌కొస్తే ప‌రిశ్ర‌మ అవినీతి అడ్డా, అక్ర‌మ‌మాల పుట్ట అని తానెప్పుడో  చెప్పానని ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాననీ చెబుతున్నారు. 

త‌మ‌కంత టాలెంట్ లేకుంటే ఏడు జాతీయ అవార్డులు ఎలా వ‌స్తాయంటారు సినీ కార్మిక సంఘం అధ్య‌క్షుడు అమ్మిరాజు. ఇక బాహుబ‌లి నుంచి పుష్ప వ‌ర‌కూ తెలుగు సినిమా ఖ్యాతి అంత‌ర్జాతీయ స్తాయికి చేరింది, మ‌రి ఇదెలా సాధ్య‌మైంది? మొన్నామ‌ధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌  ఆస్కార్ సాధించింది. ఇందులో ఉన్న‌దంతా తెలుగు వారి ప్ర‌తిభా పాట‌వాలే. అలాగే  మ‌న త‌గ్గేదేలే, బ్రో ఐ డోంట్ కేర్ వంటి మేన‌రిజ‌మ్స్.. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి కదా.. మ‌న పాట‌లు, మాట‌లు వ‌ర‌ల్డ్ వైడ్ ఆడియ‌న్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి..  ఇదంతా తెలుగు వారి ప్ర‌తిభ కాదా?  అని నిల‌దీస్తున్నారు సినీ కార్మికులు. ఒక‌రైతే విశ్వ ప్ర‌సాద్ గారూ మీరు నిర్మాణ సంస్థ  స్థాపించి ఇన్నేళ్ల‌య్యింది. 17 సినిమాల వ‌ర‌కూ తీశారు. అందులో ఓ మూడు నాలుగు త‌ప్ప ఏవైనా పెద్ద‌గా ఆడాయా? మ‌రి  మీకంత టాలెంట్ ఉంది క‌దా? ఎందుకు సాధ్యం కాలేద‌ని నిల‌దీశారు.

ఇదంతా అలా ఉంచితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చిన్న సినిమా  నిర్మాత‌లైతే ఇప్పుడిస్తున్న వేత‌నాల్లోంచి 25 శాతం వారే త‌గ్గించుకోవాల‌ని అంటారు. ఆల్రెడీ కార్డున్న వాళ్లే కాదు లేని వాళ్లు కూడా ఫీల్డ్ లోకి వ‌చ్చేలాంటి స్ట్ర‌క్చ‌ర్ రావాల‌ని విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లంద‌రి త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తుంటే.. చిన్న సినిమా నిర్మాత‌ల  త‌ర‌ఫున సీ క‌ళ్యాణ్ వ‌చ్చి ఈ బాంబు పేల్చారు. కొంద‌రు నిర్మాత‌లైతే.. 10 శాతం మేర అయితే పెంచ‌గ‌లంగానీ.. ఇంత పెద్ద మొత్తం త‌మ వ‌ల్ల కాదంటున్నారు.

ఫైన‌ల్ గా నిర్మాత‌లు వ‌ర్సెస్ కార్మికుల వ్య‌వ‌హారంలో అస‌లు పేచీ ఎక్క‌డ‌ అని చూస్తే... వారేమో వెంట‌నే 30 శాతం వేత‌నాలు పెంచాల‌ని కోరుతుంటే.. వీరేమో.. మాకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలి.. ఇక్క‌డ స‌రైన నిపుణులు లేన‌పుడు బ‌య‌ట రాష్ట్రాల నుంచి టెక్నీషియ‌న్ల‌ను తెప్పించుకునే వెస‌లుబాటు క‌ల్పించాలి. షూటింగ్ ఎక్క‌డ జ‌రిగినా రేషియో అనేది ఉండ‌కూడ‌దు. సెకండ్ సండే, ఫెస్టివ‌ల్స్ లో వ‌ర్క్ కి మాత్ర‌మే డ‌బుల్ కాల్ షీట్.. మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్.. ఈ నాలుగు ప్ర‌తిపాద‌న‌లపై ఫెడ‌రేష‌న్ నిర్ణ‌యం చెబితే.. అప్పుడు వేత‌నాల పెంపు గురించి ఆలోచిస్తామ‌ని అంటున్నారు నిర్మాత‌లు.

ఇప్పుడు మ‌రో చ‌ర్చ‌కు కూడా తెర‌లేచింది.. చిరంజీవి, బాల‌కృష్ణ వీరెవ‌రిలో ఇండ‌స్ట్రీ పెద్ద అయ్యే అవ‌కాశ‌ముంద‌న్న చ‌ర్చ‌ సైతం జ‌రుగుతోంది. చిరంజీవి అనేదాన్నిబ‌ట్టీ చూస్తే ఇది నిర్మాత‌లు, కార్మికుల స‌మ‌స్య‌... కాబ‌ట్టి వారే తీర్చుకోవాల‌ని అంటే..  బాల‌కృష్ణ మాత్రం ఇటు నిర్మాతలు,  అటు కార్మికులు ఇద్ద‌రికీ న్యాయం జ‌ర‌గాల‌ని అన్నారు. మ‌రి వీరిలో పెద్ద కాద‌గిన అర్హ‌త ఎవ‌రికుంది? అన్న‌దొక స‌స్పెన్స్ గా మారింది. చూడాలి.. ఈ కృష్ణాన‌గ‌ర్ సినిమా క‌ష్టాల వెత ఎక్క‌డి వ‌ర‌కూ వ‌స్తుందో ?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu