Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...21 బంతుల్లో శతగ్గొట్టేసిన క్రికెటర్..!
posted on: Apr 29, 2016 5:29PM

క్రిస్ గేల్ ఐపిఎల్ లో కేవలం 30 బంతుల్లో సెంచరీ కొట్టేసి రికార్డ్ సాధించాడు. ఇక ఎవరూ ఈ రికార్డును బద్ధలుగొట్టలేరని అందరూ అనుకున్నారు. కానీ మరో ఆటగాడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అది కూడా కేవలం 21 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటేసి ప్రపంచరికార్డులన్నింటినీ తుడిచేశాడు. ఇరాక్ థామస్ అని పేరున్న ఆ ఆటగాడు కూడా వెస్టిండీస్ వాడే కావడం విశేషం. క్రికెట్ కు టి20 ప్లేయర్లను అందించే వెస్టిండీస్ కు ఇప్పుడు ఈ కొత్త కుర్రాడు దొరికాడు. ప్రపంచపు దృష్టిని 23 ఏళ్ల ఇరాక్ థామస్ ఆకర్షించాడు. త్వరలోనే అతను ఐపిఎల్ టీంకు ఆడితే ఆశ్చర్యపోవక్కర్లేదు. అతని 21 బంతుల సెంచరీలో 15 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. వెస్టిండీస్ లోని ట్రినియాడ్ అండ్ టొబాగోలో జరుగుతున్న టి20 టోర్నీ లో ఈ రికార్డ్ నమోదైంది. లోకల్ గా ఉన్న స్క్రాబరో టీమ్ కు స్ప్రే సైడ్ కు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో స్ప్రేసైడ్ మొదట బ్యాటింగ్ చేసి 152 పరుగులు చేసింది. స్క్రాబరో తరపున ఆడుతున్న ఇరాక్ బరిలోకి దిగి కేవలం 8 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసేశాడు. మొత్తం 31బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం.


.jpg)



