కొవ్వు తగ్గాలంటే

 

కొలెస్ట్రాల్.... ఈ మాట వినటం సర్వసాదారణం అయిపొయింది. ఇది శరీరంలో సమపాళ్ళలో ఉంటే  పర్వాలేదు కాని కాస్త పెరుగుతున్న సూచనలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టాల్సిందే  అంటున్నారు వైధ్యనిపుణులు. మనం తీసుకునే ఆహరపధార్ధాల్లో కొవ్వు శాతం ఎంత ఉందో, ఎంత ఉండచ్చో అనే విషయాలపై అవగాహన లేకపోవటమే కొవ్వు పెరగటానికి ప్రధాన కారణం అంటున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువయితే అది గుండె పోతుకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు కార్డియోలజిస్ట్ లు.

 

అయితే ఆహారంలో  మనం తీసుకునే కొన్ని పదార్ధాల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.

 

 

 

*  చూడగానే తన ఎర్రటి రంగుతో కూరాలకి మంచి రంగునిచ్చే మిరపకాయలు కొవ్వుని కరిగిస్తాయట. ఎండుకారం ఒంట్లో వేడి పుట్టేలా చేసి కొవ్వుని నియంత్రిస్తుంది. అంతేకాదు రోగనిరోదక శక్తిని కూడా పెంచుతుందిట. అయితే వేసవిలో మాత్రం వీటి వాడుకలో కొంత మార్పులు చేసుకోవాలి.

 

 

*  మిరియాలలో ఉండే పిపరైన్ అనే పదార్థం ఒంట్లో కొవ్వుని పెంచే కణాల పెరుగుదలని నియంత్రిస్తుందిట.కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూరలలో కారానికి బదులు మిరియాలపొడి వేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.

 

 

 

మసాల దినుసులలో మంచి ఘుమఘుమలాడే దాల్చిన చెక్కకి కూడా కొవ్వుని కరిగించే గుణం ఉంది. ఇది షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచటం వల్ల బరువు త్వరగా పెరగరు. దాల్చిన చెక్క పొడిలో  కొద్దిగా తేనే కలిపి వేడినీటితో సేవించినా కొవ్వు కరుగుతుంది.

ఇలా ఆహారవిషయంలో పాటించే కొద్దిపాటి జాగ్రత్తల వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు. 

 

...కళ్యాణి