చాకొలేట్ తో ఉత్సాహం..

 

చాకొలేట్ తినాలని పదే పదే అనిపించడం వెనుక పోషక పదార్ధాల లోపం వుందంటున్నారు పరిశోధకులు. పిల్లలకు ప్రోటీన్లు సమృద్దిగా వుండే పదార్ధాలను పెడితే వారి మనసు చాకోలెట్స్ మీదకి మళ్ళదు అని కూడా చెబుతున్నారు వీరు. నిజానికి ఆహార పదార్దాల సమతుల్యత పాటిస్తూ భోజనం చేసే పిల్లలకు చాకోలేట్లు ఎటువంటి ఇబ్బంది కలిగించవట. 

సాదారణ స్థాయి తీపి చాకోలేట్లను ప్రకృతి సహజమైన చక్కరతో తయారుచేస్తారు. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఏవిదమైన హాని కలిగించవు. పైగా డ్రై ఫ్రూట్స్ కలిగిన చాకోలెట్స్ ఆరోగ్యానికి మంచివని కూడా చెబుతున్నారు. చాకొలేట్ తిన్నప్పుడు మెదడు ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేస్తుంది. ఇది మనిషికి మంచి ఉత్స్తాహం అందిస్తుంది. డిప్రెషన్ భావాన్ని పోగొడుతుంది. అలాగే చాకొలేట్లో ఫినోలిక్ మూలకాలు వుంటాయి. 

ఇవి రక్త నాళాలతోకలసి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు అంత త్వరగా రావు అంటున్నారు పరిశోధకులు. అలాగే చాకొలేట్ సహజమైన బాధనివారిని అరటి పండులో కన్నా అధికమైన ప్రోటీన్లు వుంటాయట. సో ఇప్పుడు చెప్పండి చాకొలేట్ ను తినడం మంచిదా కాదా ? పిల్లలతో పాటు మనము ఓ చాకొలేట్ ను నోట్లో వేసుకుందామా ? ఆలోచించండి...

-రమ