మేయర్ అనురాధ, మోహన్ హత్యలకు నిరసనగా బంద్
Published on: Wed Nov 18, 2015 10:31AM

చిత్తూరుజిల్లా మేయర్ కటారి అనురాధ, మోహన్ హత్యలకు నిరసనగా బంద్ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని పలు వాణిజ్య వ్యాపార సంస్ధలు, విద్యా సంస్థలు, దుకాణాలు మూసివేశారు. దీంతో జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు.. 144 సెక్షన్ విధించారు.
నిన్న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మున్సిపల్ కార్యలయంలో తన ఛాంబర్లో ఉన్న అనురాధ ఆమె భర్త మోహన్ పై దుండగులు కత్తులతో దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనురాధ మోహన్ లను వేలూరు ఆస్పత్రికి తరలించగా అనురాధ మరణించింది. అయితే భర్త పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా మోహన్ కూడా నిన్న రాత్రి 9 గంటలకు మరణించాడు.
ఇదిలా ఉండగా అనురాధ మృతదేహానికి పోస్టుమార్టం చేయగా.. నుదుటి ఎడమవైపు బులెట్ దిగిందని.. మెదడు చిట్లిపోయిందని.. దీంతో అనురాధ మరణించిందని వైద్యులు తెలిపారు.


