TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒంటరి ఏనుగు హల్చల్

Published on: Fri Oct 3, 2025 4:40PM

 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ముసలిమడుగు గ్రామం పరిసరాల్లో ఒక ఒంటరి ఏనుగు ప్రజలను హడలెత్తిస్తోంది. ఏనుగుల క్యాంపు దగ్గర ప్రహరీ గోడను తోసేసి లోపలికి దూసుకెళ్లిన ఆ ఏనుగు, అక్కడున్న కుంకి ఏనుగుల వాసన పట్టుకుని వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోకి చేరిన వెంటనే ఆ ఏనుగు గింకరించడంతో గ్రామస్థులంతా భయంతో పరుగులు తీశారు. 

రైతుల పంట పొలాలే ప్రధాన బలైపోయాయి. వరి, చెరుకు, అరటితోటలు తొక్కి నాశనం చేస్తూ ఏనుగు రాత్రింబవళ్లు సంచరిస్తోంది. అప్పులు చేసి పంటలు పండిస్తున్నామని. కానీ ఒక్క రాత్రిలో ఏనుగు వచ్చి మొత్తం పంటలను నాశనం చేస్తోంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో కాపలా కాస్తూ రాత్రంతా నిద్రలేకుండా గడుపుతున్నామని ప్రజలు భయాందోళనకు గురవుతుండగా, రైతుల కష్టాలు బుగ్గిపాలు అవుతుందని వారు వాపోయారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.