Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బంగారు పాళ్యంలో జగన్ పర్యటనపై కేసు నమోదు
posted on: Jul 10, 2025 7:39PM
.webp)
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి, యార్డులో 500 మందికి మాత్రమే అనుమతిచ్చినా.. నిబంధనల్ని పాటించలేదంటూ ఓ కేసు పెట్టారు.
ఇందులో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్, బంగారుపాళ్యం మండల వైసీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ కుమార్‌రాజా పేర్లను ప్రస్తుతానికి చేర్చారు. జగన్ వచ్చేటప్పుడు ఆ మార్గంలో రోడ్డు మీద మామిడి కాయల్ని పారబోసిన ఘటనలో అక్బర్, ఉదయ్‌కుమార్ అనే ఇద్దరిపై రెండో కేసును నమోదు చేశారు. మీడియా ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై దాడికి సంబంధించి మూడో కేసు నమోదైంది. BNS 223, 126(1)r/w 3(5) సెక్షన్లు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టనున్నారు. నిందితులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.


.webp)



