TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కటారి దంపతుల హత్య కేసులో షాక్..కార్పోరేటర్ ఆత్మహత్య..!

Published on: Thu Dec 17, 2015 11:08AM

చిత్తూరు జిల్లా కటారి దంపతుల హత్య కేసులో మరో షాక్ తగిలింది. చిత్తూరు నగర 38వ డివిజన్ కార్పోరేటర్ శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎంతోమందిని విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న పోలీసులు శివప్రసాద్ రెడ్డిని విచారించారు. అయితే విచారణ అనంతరం ఇంటికి వచ్చిన కార్పోరేటర్ శివప్రసాద్ రెడ్డి రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పోలీసులు అసలు శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని విచారణ జరుపుతున్నారు. శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సికె రెడ్డి అనుచరుడు.