చిరంజీవి మీదకి కోడిగుడ్డు!

posted on: Apr 26, 2014 4:34PM

 

 

 

చిరంజీవికి, కోడిగుడ్లకి ఏదో లింక్ ఉన్నట్టుంది. ఎందుకంటే, రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడి మీద పడనన్నిసార్లు చిరంజీవి మీద కోడిగుడ్లు పడ్డాయి. ఎన్నిసార్లు తనమీద కోడిగుడ్లు పడ్డా వాటిని దులుపుకుని వెళ్ళిపోతారు. ఆయనలో వున్న గొప్పతనం అది. ఆయన గొప్పతనాన్ని నిరూపించే సంఘటన మరోసారి జరిగింది. శుక్రవారం నాడు మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో చిరంజీవి ప్రసంగిస్తున్నారు. కాసేపు కాంగ్రెస్‌కి ఓటేయండని బాగానే మాట్లాడిన చిరు సడెన్‌గా వాయిస్ పెంచారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మీద ఘాటు విమర్శలు చేయడం ప్రారంభించారు. సదరు విమర్శలు అదుపుతప్పి మోడీని ‘హిట్లర్’ అనడం వరకూ వెళ్ళాయి. నాన్‌ స్టాప్‌గా మోడీని విమర్శిస్తున్న చిరంజీవిని భరించలేకపోయిన బీజేపీ కార్యకర్తలు చిరంజీవి మీదకి కోడిగుడ్లు విసిరినట్టు తెలుస్తోంది. అయితే గురిచూసి విసరకపోవడం వల్ల కోడిగుడ్ల నుంచి చిరంజీవి జస్ట్ మిస్సయ్యారట. కోడిగుడ్లు విసిరిన బీజేపీ కార్యకర్తల కోసం పోలీసులు వెతుకుతున్నారట.

google-ad-img
    Related Sigment News
    • Loading...