శిరీష్ హీరో అంటే షాక్ అయ్యాను: చిరంజీవి
Published on: Thu Apr 18, 2013 5:26PM
.jpg)
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో అల్లు శిరీష్ తొలి చిత్రం 'గౌరవం' శ్రీరామ నవమి సంధర్బంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా అల్లు శిరీష్ ను కేంద్రమంత్రి చిరంజీవి మెగా అభిమానులకు పరిచయం చేశారు. ''అల్లు శిరీష్ చాలా తెలివైనవాడు. అరవింద్‌గారి బాధ్యతల్ని చూసుకుంటాడనుకున్నాను. కానీ హీరో అవుతానన్నాడు. ముందు ఓ నిమిషం షాక్ అయ్యాం. మీ రక్తంలోనే నటన ఉంది. నటించు'' అని అన్నాను. "రాజకీయ హోదా కావచ్చు, మరేదైనా కావచ్చు. అభిమానుల అండ చూసి అధిష్టానం నాకు ఇచ్చింది. చిరంజీవి వెనుక ఇన్ని లక్షల మంది ఉన్నారన్న ఆలోచనతోనే నన్ను పిలుస్తున్నారు. పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ని అభిమానులు ఆదరించిన తీరు మరువలేను'' అని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు.


