Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిరంజీవికి సిగ్గులేదు: కొత్తగా కనుక్కున్న కిరణ్
posted on: Apr 26, 2014 12:52PM
.jpg)
చిరంజీవికి సిగ్గు లేదంట. ఈ విషయాన్ని తానేదో కొత్తగా కనుక్కున్నట్టు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ చెబుతున్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీని సిగ్గులేకుండా విడిచిపెట్టేశానని చిరంజీవి పదేపదే విమర్శిస్తున్నారని, నిజానికి సిగ్గులేనిది తనకుకాదని.. ఇంకా కాంగ్రెస్ పార్టీని, మంత్రి పదవిని వదిలిపెట్టకుండా వున్న చిరంజీవికేనని కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పాపం కిరణ్ కుమార్ ఆవేదనలో కూడా నిజం వుందనే అనుకోవాలి. ఎందుకంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే అసాధ్యమైన బాధ్యతని భుజాన వేసుకున్న చిరంజీవి మొదటి నుంచీ కిరణ్ కుమార్ రెడ్డి మీద ఏదో ఒక విమర్శ చేస్తూనే వున్నాడు. చిరంజీవి ఎక్కడ మాట్లాడినా కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టకుండా ప్రసంగం పూర్తి కావడం లేదు. చాలాకాలంగా చిరంజీవి తిట్లని భరిస్తున్న కిరణ్ కుమార్ శనివారం నాడు శ్రీకాకుళంలో చిరంజీవికి సిగ్గేలేదన్న విషయాన్ని డిసైడ్ చేశారు.


.jpg)
.jpg)


