చిరంజీవి కాళ్లు విర‌గొడ‌తా

posted on: Aug 2, 2013 8:25PM

 

సీమాంద్రలో రేగుతున్న విభ‌జ‌న సెగ‌లు ఇన్నాళ్లుగా ఇంటిప‌ట్టున ఉన్న నేత‌లు కూడా ప‌ని క‌ల్పిస్తున్నాయి. చాలా కాలం క్రితం ప్రజారాజ్యం పార్టీలో కీల‌క పాత్ర పోషించి, త‌రువాత చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌డంతో ఆయ‌న మీద దుమ్మెత్తిపోసిన నాయ‌కురాలు శోభారాణి. చిరు కాంగ్రెస్‌లో చేర‌డంతో త‌రువాత కొద్ది రోజులు వైకాపా వెంట తిరిగిన వాళ్లు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మైకుల ముందు క‌నిపించ‌ట‌మే మానేసింది.

అయితే తాజాగా తెలంగాణ‌కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రక‌ట‌న చేయ‌డంతో మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చింది శోభారాణి. విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి పై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. చిరంజీవి క‌నిపిస్తే రాళ్లతో, చెప్పుల‌తోకొడ‌తాన‌న‌ట‌మే కాకుండా కాళ్లు విర‌గొడ‌తానన్నారు.. అంతేకాదు రాష్ట్ర విభ‌జ‌న‌కు నిర‌స‌న‌గా త‌న నివాసంలోనే ఆమె ఆమ‌ర‌ణ నిర‌హార దీక్షకు దిగారు.

చిరంజీవి స‌మైక్యాంద్రకు మ‌ద్దతు ఇవ్వటం వ‌ల్లే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కోసం ప‌ని చేశామ‌ని, ఇప్పుడు అదే విష‌యంలో చిరు మౌనంగా ఉంటడ‌టం బాధ‌క‌ర‌మ‌న్నారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి నటుడని నిరూపించుకున్నారని, ఇకపై చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల చిత్రాల ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...