కాకతీయ నిధులపై చిరు తొలి సంతకం

posted on: Nov 1, 2012 3:35PM

 Chiranjeevi, Chiranjeevi Tourism Ministry, Tourism Ministry Chiranjeevi, chiranjeevi congress

 

మెగాస్టార్ చిరంజీవి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలు మంజూరు చేస్తూ చిరు తొలి సంతకం చేశారు. పర్యాటక శాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖ అన్నారు. భారత దేశం విభిన్న సంస్కృతులకు ప్రత్యేకమైనదన్నారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

 

తనకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు చిరంజీవి. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి అల్లుఅరవింద్, మంత్రులు గంటా శ్రీనివాస్‌రావు, పితాని సత్యనారాయణ, రామచంద్రయ్య తదితరులు హాజరై చిరంజీవికి అభినందనలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...