టీడీపీ నేతలను ఏం చేయడానికైనా వెనుకాడరు.. చినరాజప్ప

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న చినరాజప్ప మాట్లాడుతూ ఓ పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని పట్టించారని, తెలంగాణ తెదేపా నేతలను ఏం చేయడానికైనా కేసీఆర్ వెనుకాడరని.. కేసీఆర్ ది అలాంటి క్రిమినల్ మైండ్ అని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని, అందుకే ఎలాగైనా తెదేపాను దెబ్బతీయాలని ఈ విధంగా చేశారని అన్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్ఫష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu