రోడ్డు ప్రమాదంలొ చిన్నారి మృతి

posted on: Feb 24, 2026 9:50AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంగళవారం (ఫిబ్రవరి 24) తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మరణించింది. వేగంగా వెడుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి అక్కడికక్కడే మరణించగా. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రుల పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...