వివిధ శాఖల అధికారులతో తెలంగాణ సీఈవో కీలక సమావేశం
Published on: Wed Aug 24, 2022 10:41PM

ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వికాస్ రాజ్ ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం మొదలైన వాటిపై బుధవారం కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన జీహెచ్ఎంసీ, ఉన్నత విద్య, పంచాయితీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహా వివిధ శాఖల అధికారులను.. యువత, మహిళలు మరియు సాధారణ ప్రజలకు సందేశాలు చేర్చడంలో సహకారం అందించాలని తెలంగాణ సీఈవో కోరారు.
అలాగే భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఓటర్ల నమోదులో కొన్ని ముఖ్యమైన సంస్కరణలను తీసుకొచ్చిందని, తదనుగుణంగా ఫారమ్‌లు సవరించబడ్డాయని అన్నారు.
వీటిపై ప్రజలకు అవగాహన కలిగించేలా వివిధ మార్గాల్లో ప్రచారం చేస్తామని వికాస్ రాజ్ చెప్పారు.


