చావుబతుకుల్లో వున్న ఛోటారాజన్

 

 

 

అంతర్జాతీయ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం చిరకాల ప్రత్యర్థి అయిన ఛోటా రాజన్ చావుబతుకుల్లో. మాఫియా కార్యకలాపాలతో ఎంతోమందిని చంపేసిన ఛోటారాజన్ ఇప్పుడు తానే చావుబతుకుల్లో వున్నాడు. ఈ మాఫియా లీడర్‌కి మరో మాఫియా లీడర్ అయిన దావూద్ ఇబ్రహీం అంటే అస్సలు పడదు. దావూద్ ఇండియాలో ఉన్నంతకాలం వీళ్ళ మనుషులు కొట్టుకు చస్తూ వుండేవాళ్ళు. ప్రస్తుతం వయసు బాగా పైబడిన ఛోటారాజన్ ఆరోగ్య పరిస్థితి చెయ్యి దాటిపోయినట్టు తెలుస్తోంది.

 

ప్రస్తుతం ఇతగాడు మలేసియాలోని ఓ ఆస్పత్రికో కిడ్నీకి సంబంధించిన చికిత్స చేయించుకుంటున్నాడు. ఆ కిడ్నీ సమస్య కూడా దావూద్ ఇబ్రహీం వల్లే వచ్చింది. 2001లో దావూద్ కాల్చిన తుపాకీ గుండు ఛోటా రాజన్ కిడ్నీలోకి దూసుకుపోయింది. అప్పటి నుంచి రాజన్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ముంబైలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటూ జీవితాన్ని ప్రారంభించిన రాజన్ క్రమంగా మాఫియా లీడర్‌గా ఎదిగాడు.


1993లో ముంబై పేలుళ్ళ తర్వాత దావూద్ ఇబ్రహీంతో ఇతని శత్రుత్వం మరింత పెరిగిందని అంటారు. ప్రస్తుతం రేపోమాపో అన్నట్టుగా వున్న ఛోటా రాజన్ ఈ దశలో కూడా దావూద్ మీద పగ వదిలిపెట్టలేదు. దావూద్ ఇబ్రహీంని చంపకుండా నేను చావనుగాక చావనని అంటున్నాడట. ఛోటా రాజన్ ఆరోగ్యం విషయంలో మలేసియా డాక్టర్లు చేతులెత్తేశారట. ఎంతోమంది చావుకి కారణమైన ఈ మాఫియా డాన్ కథ త్వరలో ముగియబోతోంది.