జవాన్లపై దాడి.. ప్రతీకారంతోనే చేశాం..
Published on: Thu Apr 27, 2017 6:27PM
.jpg)
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేసి దాదాపు 25 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి ప్రతీకార చర్య అని మావోయిస్టు పార్టీ తెలిపింది. అశేష ప్రజల అణచివేతకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు దండకారణ్య మావోయిస్టు స్పెషల్ జనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఈ దాడి చేశామని, పోలీసులపై వ్యక్తిగత కక్ష్యతో కాదని పేర్కొన్నారు. సుక్మా దాడితో తమపై హింసావాదులనే ముద్రవేస్తసున్నారని, కానీ అణగారిన వర్గాల ప్రజల బాగు కోసం ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు.


