చెవిరెడ్డి హడావుడితో జగన్ కు చిక్కులు..?
posted on Dec 3, 2015 9:41AM

వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉండి.. అధికార పార్టీని విమర్శించడంలో ఎప్పడూ ఫస్ట్ ఉంటారు. అలా విమర్శించే నేతకే ఇప్పుడు ఆపార్టీలోని ఒక నేత చేసే విమర్శలు తలనొప్పిగా తయారయ్యాయి. అది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి ఈ మధ్య తనకు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నాడని చాలామంది నేతలు జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారంట. దీంతో పదే పదే అందరిని విమర్శిస్తూ.. వివాదాల్లో చిక్కుకుంటూ తలనొప్పులు తెచ్చిపెడుతున్న చెవిరెడ్డికి జగన్ వార్నింగ్ ఇచ్చారట. మళ్లీ ఇలాంటి వివాదాల్లో తెచ్చిపెడితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట. కానీ చెవిరెడ్డి నడవడిక తెలిసిన నేతలు మాత్రం.. ఎవరెన్ని చెప్పినా చెవిరెడ్డి మాత్రం మారడు అని అనుకుంటున్నారు.
కాగా గతంలో చెవిరెడ్డి బడ్జెట్ సమావేశాల్లో కోడెల పెద్ద గూండా అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందుకున్నారు. అనంతరం సొంత నియోజకవర్గంలో కొందరనీ కులం పేరుతో దూషిస్తున్నారన్న కారణంగా ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదుచేశారు. ఇక ఇప్పుడు ఎంపీ మిధున్ రెడ్డితో కలిసి ఎయిర్ పోర్ట్ మేనేజర్ పై చెవిరెడ్డి దాడి చేయడం. మరి జగన్ వార్నింగ్ కు భయపడైనా చెవిరెడ్డి నోటివాటం తగ్గిస్తారో లేదో చూడాలి.