ప్రియుడా..? కాలయముడా..?

 

ఓ ప్రియుడు రాక్షసుడిలా మారి ప్రియురాల్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన సోమవారం చెన్నైలో జరిగింది. వివరాల ప్రకారం దినేశ్ కన్నప్పన్ (25) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనికి అదే బ్యాంకులో పనిచేస్తున్న అరుణ శ్రీనివాసన్ తో చాలా కాలంగా పరిచయం ఉంది. వీరిద్దరూ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే దినేశ్ గత రాత్రి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి అయనవరంలోని అరుణ ఫ్లాట్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో దినేశ్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయి అరుణని ఫ్లవర్ వాజ్ తో బలంగా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని దినేశ్ ఓ బెడ్ షిట్ లో చుట్టి లోయలో పడేశాడు. స్థానిక యువకుడు దినేశ్ చర్యలను అనుమానించి పోలీసులకు సమాచారం అందిచగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు పరారయ్యాడు. అసలు అతను ఎందుకు హత్య చేశాడో తెలియదని అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తేకానీ వివరాలు తెలియవని పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu