TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చాట్ల శ్రీరాములు కన్నుమూత

Published on: Fri Dec 18, 2015 9:12AM

 

నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు (85) కన్నుమూశారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చాట్ల శ్రీరాములు 1931లో విజయవాడలో జన్మించారు. ఆయన నాటక రంగంలో విశేష కృషి చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ పురస్కారంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. చాట్ల శ్రీరాములు రైల్వే ఉద్యోగిగానే పనిచేస్తూ 1976 నుంచి నాటకరంగంలో కృషి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మొట్టమొదటి అనౌన్సర్‌గా చాట్ల శ్రీరాములు పనిచేశారు. చాట్ల శ్రీరాములు కొన్ని సినిమాలలో కూడా నటించారు.