TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ ప్రారంభం

Published on: Sun Jun 8, 2025 12:14PM

 

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు ప్రసాదం పంపిణీని కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా పేషంట్లు తరలివస్తున్నారు. మంత్రికి చేప ప్రసాదాన్ని బత్తిని కుటుంబ సభ్యులు స్వయంగా అందించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జూన్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ చేప ప్రసాదాన్ని ప్రజలకు అందించనున్నారు. 

ఈ కార్యక్రమం కోసం టీజీఆర్టీసీ  ప్రత్యేక బస్సులను సికింద్రాబాద్, కాచిగూడ, జేబీఎస్, ఎంజీబీఎస్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు నడుపుతోంది.ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జూన్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ చేప ప్రసాదాన్ని ప్రజలకు అందించనున్నారు.