Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ గడ్డపై చంద్రబాబు.. బాధ దిగమింగుకొని ప్రజల్లోకి..
posted on: Nov 23, 2021 11:44AM
భరించలేని బాధలో ఉన్నారు చంద్రబాబు. ఆ కన్నీటి చారలు ఇంకా ఆరనే లేదు. గుండె గాయం మాననే లేదు. ఆ మనసిక వేధ ఇంకా మదిని తొలిచేస్తూనే ఉంది. సభలో కౌరవ మూక చేసిన దారుణ పరాభవం నుంచి ఇంకా కోలుకోనే లేదు. అయినా, ఆ బాధను గొంతులోనే దిగమింగుకున్నారు. కన్నీటిని అతికష్టం మీద తుడిచేసుకున్నారు. ప్రజల బాధ ముందు తన బాధ ఎంతనుకున్నారు. వరదలతో విలవిల్లాడుతున్న జనం కష్టాలను కళ్లారా చూసేందుకు కదలివచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాయకుడంటే ఇలా ఉండాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్‌ను పక్కనపెట్టేసి.. ప్రజల కోసం ఇలా తరలిరావాలి. అందుకే చంద్రబాబు నిజమైన లీడర్. ప్రజలు మెచ్చే నాయకుడు.
భారీ వర్షాలు, వరదలతో రాయలసీమలో కనీవినీ ఎరుగని విపత్తు. జలఖడ్గం అనేక గ్రామాలకు లోతైన గాయం చేసింది. పదుల సంఖ్యలో ప్రజలు జల సమాధి అయ్యారు. లక్షల ఎకరాలు నీట మునిగాయి. ఊర్లకు ఊర్లే ధ్వంస మయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కన్నీటి సంద్రమయ్యారు. ప్రజల కష్టాలను చూసి చంద్రబాబు చలించిపోయారు. సీఎం జగన్‌రెడ్డి తనకేమీ పట్టనట్టు ప్యాలెస్‌కే పరిమితమైనా.. విమానంలో విహరించిపోయినా.. సొంతజిల్లాను కనీసం కన్నెత్తి చూడకపోయినా.. ప్రతిపక్ష నేత మాత్రం జగన్‌లా తనకేమీ పట్టనట్టు ఉండలేకపోయారు. వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు కదలివచ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ.. ప్రజల దుఃఖాన్ని తీర్చేందుకు, బాధితులను ఓదార్చేందుకు ముందుకొచ్చారు చంద్రబాబు.
వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప వచ్చారు. కడప విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. సీఎం జగన్‌రెడ్డి సొంత ఇలాఖాలో చంద్రబాబుకు అనూహ్య ప్రజాధరణ లభించింది. బాబుకు వెల్‌కమ్ చెప్పేందుకు.. పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు నినాదాలతో కడప మారుమోగింది.

చంద్రబాబు రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. రోజంతా కడప జిల్లాలోనే చంద్రబాబు పర్యటిస్తారు. బుధవారం చిత్తూరు.. గురువారం నెల్లూరు జిల్లా వరద ప్రభావ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.


.webp)



