Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణకి మేం వ్యతిరేకం కాదు : చంద్రబాబు
posted on: Oct 23, 2012 9:52AM
.jpg)
తెలంగాణ కి తాము వ్యతిరేకం కాదని టిడిపి అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అక్కడకూడా తాము ఈ విషయాన్నే చెబుతామన్నారు. తెలంగాణ ఇవ్వడం ఇవ్వకపోవడం అంతా కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది కాబట్టి, తాము తెలంగాణకి మద్దతు ప్రకటించడంతప్ప ఏమీ చేయలేమని బాబు అన్నారు. తెలంగాణ ఇవ్వగల సత్తా ఉండికూడా మౌనం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి తమ పార్టీపై ఒత్తిడి పెంచడం ఏమేరకు సమంజసమో తెలంగాణ వాదులు ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తెలంగాణ విషయంలో నాటకాలాడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై మరో పార్టీకూడా రాష్ట్రంలో తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకుంటోందంటూ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా రాజోలిలోకి అడుగుపెట్టి తెలంగాణలో పాదయాత్రని కొనసాగిస్తున్న చంద్రబాబు తను మళ్లీ అధికారంలోకి రాగానే మాదిగల రుణం తీర్చుకుంటానని ప్రకటించారు. పదివేల కోట్ల రూపాయలతో బీసీ లకు ఉపప్రణాళికను ఏర్పాటు చేస్తానని పాలమూరు పాదయాత్రలో చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని కనుక్కుంటామంటూ పాదయాత్రకి అడ్డుతగిలే ప్రయత్నం చేసిన తెలంగాణ పొలిటికల్ జెఎసి నేతల్ని పోలీసులు దారిలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు.


.jpg)
.jpg)


