TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కు చంద్రబాబు పంచ్

Published on: Mon Aug 31, 2015 12:17PM

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. దీనిపై జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వారు ఆత్మహత్యలు చేసుకోలేదని... కేవలం చంద్రబాబు నాయుడు బీజేపీ మంత్రులు ఇస్తున్న స్టేట్ మెంట్ల పై నమ్మకం లేకే వారు ఆవేదనతో చనిపోయారని జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన సీఎం చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్మోహ్న్ రెడ్డి ఏం చేశారని..ఆయన పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు.

 

పార్లమెంటు సమావేశపు హాలు తలుపులు మూసేసి మరీ రాష్ర్ట విభజన చేస్తుంటే జగన్ పార్లమెంటులో కూర్చుని ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రి వెంకయ్యనాయుడు రాష్ర్టానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే అప్పుడు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.