Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బర్త్ డే వేడుకలు రద్దు
posted on: Apr 20, 2013 11:58AM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటితో 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం నేడు. వస్తున్నా మీకోసం అంటూ ఆరున్నర నెలలుగా పాదయాత్ర చేస్తున్న ఆయన పాదయాత్ర ఈ రోజుకు సరిగ్గా 200 రోజులకు చేరుకుంది. అయితే ఆయన తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం లేదు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేడుకలు జరపవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారి మీద అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, దాని కేసు నమోదులో పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా జన్మదిన వేడులకు దూరంగా ఉంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. బాబు జన్మదినం కోసం 64 కిలోల కేకును సిద్దం చేసిన పార్టీ శ్రేణులు ఆయన నిర్ణయంతో వెనక్కితగ్గారు. జన్మదినం సంధర్భంగా బాబును కలిసేందుకు పాదయాత్ర జరుగుతున్న చోటికి ఆయన భార్య భువనేశ్వరి విచ్చేశారు.






